ENGINEERING FORUMS

WELCOME GUEST,
You may have to register before you can post: click the register to proceed. To start viewing messages, select the forum that you want to visit from the selection. From www.bunkerszone.co.cc

Join the forum, it's quick and easy

ENGINEERING FORUMS

WELCOME GUEST,
You may have to register before you can post: click the register to proceed. To start viewing messages, select the forum that you want to visit from the selection. From www.bunkerszone.co.cc

ENGINEERING FORUMS

Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.
ENGINEERING FORUMS

hi

Sorry For The Themes I Am Still Working On it. Still I Need Some Help Needed Moderators And Co-owners Pm me

    collection of telugu kavitalu(తెలుగు కవితలు)

    Admin
    Admin
    Übergod
    Übergod


    Posts : 360
    Reputation : 3
    Join date : 2010-07-18
    Age : 30
    Location : Rajam

    collection of telugu kavitalu(తెలుగు కవితలు)   Empty collection of telugu kavitalu(తెలుగు కవితలు)

    Post by Admin Thu Aug 05, 2010 4:14 pm

    తెలుగు కవితలు


    నీకు రాసివ్వాలనే ఉంది..

    గుండె గుండెకు మధ్య
    విధి వింతగా ప్రవర్తించినప్పుడల్లా
    వెదికి వెదికి వజ్రాన్ని సంపాదించినట్లు
    ఆ పిలుపు ప్రకంపనల ద్వారా
    నీ హృదయంలో దాక్కోవాలనే ఉంది

    నిస్వార్ధంగా...నిజంగా ఉండాలే గాని
    తాకి చూడలేని తారల్ని సైతం
    తాయిలంలా నీకు పంపాలనే ఉంది

    ప్రతిక్షణం పంచే నీ అనురాగంలో
    రాగాన్ని నేనై ఉండాలే కానీ
    నీ స్పర్శను అంతరాత్మలో భద్రపరుచుకోవాలనే ఉంది



    నీ నిత్య నామ స్మరణలో
    నా నామం ఒక్క క్షణమైనా వినిపించాలే కానీ
    శాశ్వతంగా నీ చిరునవ్వుల చిరునామానైపోవాలని ఉంది

    కదులుతున్న ఈ నిరంతర పోరాటంలో
    నీకు నేను నాకు నీవు అనిపించాలే కానీ
    నీ అడుగుల సవ్వడిని అందరికి వినిపించాలనే ఉంది

    కారణం ఏదైనా కానీ
    కనుచూపు మేరలో నువ్వు కనబడాలే కానీ
    కలవపువ్వునై నిత్యం నిన్ను కొలవాలనే ఉంది

    ఈ అనంత విశ్వంలో
    ఉన్న ఎన్నో బ్రమ్హాండాలలో
    అణువైనా నాకోసం నువ్వు వెదుక్కోవాలే కానీ
    హృదయాకారంలో నిన్ను వెంబడించాలనే ఉంది


    లక్షల వేల క్షణాల కాలంలో
    ఏ కొద్దీ కాలమైనా నువ్వు నాకై నిరీక్షించాలే కానీ
    నా జీవితాన్ని నీకు పూర్తిగా రాసివ్వాలనే ఉంది

    ఆ నిమిషం తెలియలేదు..........

    ఆ నిమిషం తెలియలేదు
    నీ అడుగులో అడుగెయ్యాలని
    నీ వెనకే నిలుచున్నాను
    నీ అడుగు మరో అడుగులో పడుతుందని
    నా జీవితం మరో యేడడుగులే అని
    ఆ నిమిషం తెలియలేదు

    నీ మాటలే నా పలుకవ్వాలని
    నా మాటలకి మౌనం నేర్పాను
    నీ మాటలే అరువొస్తున్నాయని
    నా పలుకు మూగబోతుందని
    ఆ నిమిషం తెలియలేదు

    నువు నాతో ఉంటే యే చిక్కుముడులైతే
    నా దారికడ్డమేంటనుకున్నా
    నీకు పడ్డ మూడు ముళ్ళలో
    నా ఊపిరి చిక్కుకు పోతుందని
    ఆ నిమిషం తెలియలేదు

    కనీరై ఎదను తాకే నీ జ్ఞాపకాలు మండే నా వేదన చలర్చగలవ...

    కనీరై ఎదను తాకే నీ జ్ఞాపకాలు మండే నా వేదన చలర్చగలవ...
    నా కనీటి బాష్పల చాటు దాగున స్వప్నల పై ఒట్టు
    నా హ్రుధయం దారులు అన్ని నీ ప్రెమ పువులతొ పరిచ
    ఎకంతంలొ వేచ నీకై అనందలే మరిచ కనీరే లేని లోకన్ని స్రుహ్టించనీవు
    నీవులేవన్న సంగతినె మరిచ ఇ చికటి కల పేరే అశ అది నెకైన తెలుస మనస
    నా ఏదలొ పూసిన రొజ నీకు హ్రుదయం అన్నది లేద "అద్రుష్టం ఎరుగని
    నా జీవనపయనానప్రేమ మెరిసిన మేరుపుస్నేహం తొలకరి చినుకు
    నా పయనం ఒంటరి వైపు ........ నా పయనం ఒంటరి వైపు ........

    నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయిందినా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది........

    నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది
    నీతో నన్ను ఊహించుకుంటూ నా మది మురిసిపోయింది
    నీ అభిమానానికి నా హృదయం పొంగిపోయింది
    ఆ అభిమానానికి అర్థం తెలిసి నా గుండె ఆగిపోయింది
    నీతో చెప్పాలనుకున్న మాట నా పెదాలపై కరిగిపోయింది
    తీగ తెగిన వీణలా నా గొంతు మూగబోయింది
    నీకోసం ప్రాకులాటలో నా మనసు అలసిపోయింది
    ఏంటో ఇదంతా కలలా జరిగిపోయింది
    కాని నీకు తెలియదు, నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది

    ప్రేమకే చెల్లుతుంది.......


    అక్షరం ముక్కరనివాడి చేత అర్దాలు వెతుక్కునే కవిత్వం రాయించాలన్నా


    అరక్షణం తీరికలేని వారికి ఆజన్మాంతం వేచిచూసే ఒపికనివ్వాలన్నా

    ఆకుల అలికిడికి,కోకిల స్వరాలకు,చిరుగాలి సవ్వడికి,

    హృదయాల అలికిడితో ముడివేయలన్నాఅది ప్రేమకే చెల్లుతుంది.....



    నువ్వు ఎంత బాగుంట్టావో.....

    మల్లెలు విరిసినట్లుండే నీ నవ్వులు


    కోయిలలు కుసినట్లుండే నీ మాటలు

    వెన్నల కాసినట్లుండే నీ కన్నులు

    సెలయేరు సాగినట్లుండే నీ నడకలు

    కారుమేఘలాంటి నీ కురులు

    మలయమారుతంలాంటి నీ చూపులు

    వసంతం లాంటి నీ సోయగం

    జలపాతంలాంటి నీ రాజసం ఎంతబగుంతాయో చెలీ

    నువ్వు ఎంత బాగుంట్టావో.....

    నీ భావనా విహంగానికి...

    నీ భావనా విహంగానికి


    నా కనురెప్పలే రెక్కలనావు

    నీ ఆలోచనా తరంగానికి

    నా చిరునవ్వులే మువ్వలనావు

    నీ జీవన కధనంలో పల్లవించే మాధుర్యాలే

    నా పదాలన్నావు

    నీ భాదల ఆగదాలో కదలాడే నీడలే నా కన్నీల్లన్నావు

    అందుకే నన్నో గీతంగా నిలిపావు!

    అనుభవాలను కుర్చీ కవితగా మలిచావు !

    సృష్టిలోని తీయని పదం .........

    సృష్టిలోని తీయని పదం


    మాటలకందని కమ్మని భావం

    కెరటాలు ఎగిసిపడలేని దూరం

    హృదయానికి చేసే గాయం

    దగరగా ఉన్నా చేరువకాలేని తీరం

    జీవితాని అల్లకలోలం చేసే ప్రళయం

    సఫలమైన విఫలమైన

    చిరకాలం నిలిచిపోయే కమనీయ కావ్యం ...

      Current date/time is Mon May 06, 2024 7:18 pm